ప్రతి కేసును ఆన్లైన్ లో నమోదు చేయాలి, మిస్సింగ్ కేసుల విచారణ వేగవంతం చేయాలి : జిల్లా ఎస్.పి. కుమారి.చందన దీప్తి ఐ.పి.ఎస్. జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా యస్.పి. కుమారి చందన దీప్తి గారు జిల్లా పోలీసు అధికారులతో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేషంలో తూప్రాన్ సబ్ డివిజన్ డి.యస్.పి., మెదక్ మరియు తూప్రాన్ సబ్ డివిజన్ సి.ఐ.లు మరియు యస్.ఐ.లు పాల్గొన్నారు. ఈ సమావేశం లో యస్.పి. గారు గత నెలలో జరిగిన నేరాల గురించి సిబ్బందిని కూలంకశముగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్.పి గారు మాట్లాడుతూ…. పాత మరియు గత నెలలో జరిగిన కేసుల యొక్క వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే విచారణలో వున్నా గ్రేవ్ కేసుల యొక్క వివరాలను, ఎస్.సి., ఎస్.టి. కేసుల యొక్క వివరాలు అడిగి తెలుసుకొని విచారణ వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. FIR తరువాత చేయు నెరపరిశోధన లో పార్ట్-2 లలో ఇన్విస్టిగేషన్ ఆఫీసర్ మాత్రమే స్వయంగా వ్రాత పూర్వకంగా వివరాలు నమోదు చేయాలని అన్నారు. నెరస్తులకి తక్కువ సమయంలో చట్టప్రకారం శిక్ష పడేలా నాణ్యమైన విచారణ కొనసాగలని మరియు లాంగ్ పెండింగ్ కేసులని ఛేదించాలి అన్నారు . రోడ్డు ప్రమాదాల విషయంలో మాట్లాడుతూ…జిల్లాలోని అన్ని రహదారులలో కేటగిరిల వారిగా ఆక్సిడెంట్ హాట్ స్పాట్ మరియు ప్రోన్ ఏరియాలను గుర్తించి ఆక్సిడెంట్ జరగకుండా వాటి నివారణకు చర్యలు చేపట్టాలని, ప్రతి కేసు యొక్క వివరాలు ఎప్పటికప్పుడు సి.సి.టి.ఎన్.ఎస్. లో ( ఆన్ లైన్ ) నమోదుచేయాలని సిబ్బందికి సూచించారు. మూల మలుపులలో , ప్రమాదాలు జరిగే చోట్లలో సూచిక బోర్డ్ ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని సూచించారు. జిల్లా లో ప్రతి పోలీసు అధికారికి సి‌సి‌టి‌ఎన్‌ఎస్ లపై అవగాహన కలిగి ఉండాలి. ఆన్లైన్ లలో కేస్ లకు సంబందించిన ఎలాంటి పెండింగ్ లేకుండా చూడాలని అన్నారు. నేర దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానం ని సాధ్యమైనంత వరకు సద్వినియోగం చేసుకొని తక్కువ సమయంలో సులభ మార్గంలో నేరాలను ఛేదించాలనిఅన్నారు.

ప్రతి పోలీస్ స్టేషన్ లలో 5s లని తప్పక పాటించాలని అధికారులకు సూచించారు. పోలీసు స్టేషన్ రికార్డులను, పరిసరాలను, శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి వాహనాలు నడిపేలా చూడాలని ఈ సంధర్భముగా అధికారులకు సూచించారు. అలాగే జిల్లా ప్రజలు ట్రాఫిక్ నియమ నిభందనలు పాటిస్తూ పోలిసు వారికి సహకరించాలని కోరినారు. అదేవిదంగా ఈ పెట్టి కేసులను ఆన్లైన్ లో నమోదు చేయాలని ఆదేశించినారు. మిస్సింగ్ కేసుల గురించి మాట్లాడుతూ… ఏవరైన తప్పి పోయారు అని లేదా కనిపించుటలేదు అని ఫిర్యాదు వచ్చినప్పుడు ఆ వ్యక్తి యొక్క ఫోటోని అన్ని పోలిస్టేషన్లకు పంపించి మిస్సింగ్ వ్యక్తులను కనిపెట్టడానికి ప్రయత్నం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. పి‌ఎస్ ల వారీగా నమోదు అయిన మిస్సింగ్ కేసుల పై సమీక్షా నిర్వహించి ప్రస్తుతము పి‌ఎస్ ల వారీగా ఉన్న మిస్సింగ్ కేసులను తెలుసుకొని ఎందుకు పెండింగ్ లో ఉన్నాయి అనీ అందుకు గల కారణాలను సంబంధిత I O లకు అడిగి తెలుసుకోవడము జరిగినది. ఇట్టి మిస్సింగ్ కేసుల లల్లో I O లు ఒక పి‌ఎస్ నుండి మరొక్క పి‌ఎస్ లకు బదిలీ పై వెళ్ళిన అట్టి పాత కేసులల్లో ప్రస్తుతము ఉన్న SHO లదే పూర్తి భాద్యత అనీ ఎవ్వరూ కూడా ఇట్టి మిస్సింగ్ కేసులలో నిర్లక్ష్యము చేయకుండా ఉండి సంబంధిత కేసులను పూర్తి చేయాలని, ఇట్టి కేసులల్లో మరొక్క సారి పూర్తిగా దర్యాప్తు చేసి ఫిర్యాదు దారుల యొక్క వాంగ్మూలము ప్రకారము వారికి సంబంధీచిన వారిని గాని, వారికి ఇతరులతో ఉన్న సంబందాలను బట్టి కేసుల దర్యాప్తును చెప్పట్టాలని, మిస్సింగ్ అయిన వారి యొక్క గుర్తింపు పోటో లను పూర్తి వివరాలతో జనసంచారము ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాలల్లో మరియు మీ చుట్టూ ప్రక్కల ఉన్నటువంటి పి‌ఎస్ లకు, బోర్డర్ పి‌ఎస్ లకు సమాచారము అంధించి ,ప్రస్తుతము ఉపయోగిస్తున్న టెక్నాలజి పరంగా త్వరగా మిస్సింగ్ కేసులను పూర్తి చేయాలని సూచిస్తూ అసలు మిస్సింగ్ కావడానికి ఉన్న ప్రధాన కారణాలను వారి కుటుంబ సభ్యులను ,వారి గ్రామస్తులను గాని ,ఏదైనా సంస్థలో గాని ,పని చేస్తున్న వారు అయితే వారితో సన్నిహితంగా ఉన్నటువంటి వారితో సమాచారము సేకరించుకొని సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ప్రకారము I O లు పూర్తి భాద్యత తీసుకొని ఇట్టి , మరియు మీ సంబంధిత పి‌ఎస్ పరిధిలల్లో ఏదైనా గుర్తు తెలియని శవము లభించినట్లు అయితే ముందుగా డి‌సి‌ఆర్‌బి లో ఉన్నటువంటి మిస్సింగ్ కేసులతో సరి పోల్చుకొని అట్టి గుర్తు తెలియని శవము ల యొక్క పూర్తి వివరాలను న్యూస్ పేపర్ ద్వారా గాని, ఇతరత్ర సదుపాయాల ద్వారా మరియు బోర్డర్ పి‌ఎస్ లకు సమాచారము అంధించి, సమాచారము సేకరించుకొని అట్టి కేసులను కూడా సంబంధిత అధికారులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించడము జరిగినది.