ప్రస్తుతం చాలా మంది ఈఎంఐలతో సతమతం అవుతున్నారు. ఒకటో తేదీ వస్తే చాలు వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నెల జీతం వస్తుంది, ఈఎంఐ సౌకర్యం ఉంది కదా అన్న భరోసాతో, ఫోన్, ల్యాప్ టాప్ ఇలా ప్రతి వస్తువును కొనుగోలు చేస్తున్నారు కొందరు. దీంతో డబ్బులు చెల్లించే సమయానికి తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. చాలా మంది ఇన్ టైంలో ఈఎంఐ చెల్లించలేక పోతున్నారు. ఇప్పడు అలాంటి వారి కోసమే ఈ వార్త. ఎక్కువగా ఈఎంఐలు కడుతున్నారా, నెల వచ్చే సరికి డబ్బులు చెల్లించలేక పోతున్నారా? అయితే ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, మీకోసం ఓ అద్భుతమైన అవకాశం ఉంది. అదే లోన్ సెటిల్ మెంట్.

ఈఎంఐల భారం ఎక్కువైతే లోన్ సెటిల్ మెంట్ చేసుకుంటాం అని బ్యాంకు అధికారులకు రిక్వెస్ట్ పెట్టుకోవాలి. బ్యాంకు మీ రిక్వెస్ట్‌ను ఓకే చేస్తే మీకు సెటిల్ మెంట్ ఆప్షన్ లభిస్తుంది. కానీ అసలు మీరు ఎందుకు సెటిల్ మెంట్ ఆప్షన్ ఎన్నుకున్నారు అనేదానికి ఓ బలమైన కారణం చెప్పాల్సి ఉంటుంది. ఇలా మనం ఈఎంఐల భారం నుంచి బయట పడవచ్చు. అయితే ఇలా సెటిల్ మెంట్ ఆప్షన్ ఎన్నుకోవడం వలన కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

  • 1. సిబిల్ స్కోర్ 75 నుంచి 100 వరు తగ్గే అవకాశం ఉంటుంది.
  • 2. లోన్ సెటిల్ మెంట్ తర్వాత రుణ గ్రహితలు కొత్త రుణం పొందడానికి అవకాశం తక్కువ.
  • 3. 7ఏళ్ల వరకు రుణ గ్రహిత క్రెడిట్ రిపోర్ట్‌లో ఈ విషయం నిక్షిప్తం అయి ఉంటుంది.