ఈ రోజు మెదక్ జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయం నందు మినిస్టిరియల్ స్టాఫ్ ఏ.ఓ శ్రీ. కె.ఈశ్వర్ గారి పదవీ విరమణ వీడ్కోలు సమావేషం జరిగింది. AO శ్రీ. కె.ఈశ్వర్ గారు 37 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసుకొని, ఈ రోజు పదవి విరమణ చేయడం జరిగినది, ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి. కుమారి చందన దీప్తి IPS. గారు ఏ.ఓ శ్రీ. కె.ఈశ్వర్ గారిని పూలమాల వేసి శాలువాతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేసినారు. ఈ సందర్భంగా ఎస్.పి. గారు మాట్లాడుతూ … జీవితం లో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు ఉంటాయని వాటిలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ కుడా ఒక ఘట్టమని, ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి నిజాయితీగా మరియు కర్తవ్య దీక్షతో పనిచేయాలని కాబట్టి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ చేయక తప్పదని చెప్పినారు.

ఉద్యోగం అనేక ఒత్తిడిలతో కూడుకున్నదని, విధి నిర్వహణలో ఉద్యోగి నిబద్దతతో నిష్పక్షపాతంతో పని చేయడం వల్ల మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవచ్చని, అదేవిదంగా ఉద్యోగంలో తన పదవి కాలంలో ఉండే చిన్న చిన్న అనుభవాలు రిటైర్ అయిన తర్వాత కూడా మధురానుభూతులు గా గుర్తుండిపోతాయని, ఉద్యోగులు సగం కంటే ఎక్కువ జీవితం తమ సహా ఉద్యోగులతో గడుపుతాం కాబట్టి ఒకరి కష్టసుఖాలు ఒకరు పంచుకుంటూ ఉద్యోగ నిర్వహణలో సహకరించుకోవాలని అప్పుడే బందాలు బలపడతాయని, ఉద్యోగంలో పదవి విరమణ పొందిన తర్వాత శేష జీవితం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని ఆకాంక్షిoచినారు.

ఎలాంటి సహాయం గురించి అయిన తమను ఎల్లవేళలా సంప్రదించవచ్చని జిల్లా ఎస్.పి. గారు తెలిపారు. అదేవిదంగా ఉమ్మడి మెదక్ జిల్లా పోలీస్ విభాగంలో సుదీర్ఘంగా విధులు నిర్వహించి ఉద్యోగ నిర్వహణలో తాను చేసిన సేవలను కొనియాడినారు. ఉద్యోగ నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి అందరి మన్ననలను పొందినాడని పదవి విరమణ చేసిన ఏ.ఓ శ్రీ. కె.ఈశ్వర్ గారికి జిల్లా ఎస్.పి. గారు రిటైర్మెంట్ కి సంబందించిన బెనిఫిట్స్ పత్రాలను అందచేశారు..