ప్రపంచంలో ఎక్కడ చికిత్స లేని అత్యంత అరుదైన వ్యాదితో బాధపడుతున్న 19 సంవత్సరాల శ్రీహిత కాజిపేట కి చెందిన అమ్మాయి , శ్రీహిత పుట్టినప్పటి నుండి మంచానికే పరిమితం అయి, అచేతనంగా హృదవిధారకమైన నిస్సహాయక జీవితాన్ని గడుపుతున్నది.

శ్రీహిత కోసం తల్లిదండ్రులు శ్రీమన్నారాయణ మాధవి దంపతులు హైదరాబాద్, చెన్నై, బెంగళూర్ తిరిగి, తమ వంతుగా శ్రీహిత ను మాములు అమ్మాయిగా మార్చాలని ఎంతో ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు శ్రీహిత అనారోగ్యం కారణంగా 12 లక్షల రూపాయలు ఖర్చుచేశారు. ఇక శ్రీహిత ఫీషియోథెరఫీ కోసం ప్రతిరోజు 700 రూపాయలు ఖర్చు చేయవలిసి ఉంది. శ్రీహిత తండ్రి శ్రీమన్నారాయణ ఒక చిన్న ఉద్యోగి.
ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నార
శ్రీహిత కోసం గతంలో మాజీ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి గారు పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ గారు వచ్చి పరామర్శించారు..
ఈ సందర్భంగా వారు కూడా శ్రీహిత అనారోగ్య పరిస్థిని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసికవెళ్తామన్నారు..

దయచేసి మీరు ఏమైనా సహాయం చేయాలి అనుకుంటే వారి అకౌంట్ కి పంపించవచ్చు


మైక్రోసిఫాలి వ్యాధితో బాధపడుతున్న శ్రీహిత కోసం మానవతా దృక్పథంతో ముందుకు వచ్చిన సామాజికవేత్త చిలువేరు శంకర్, అభ్యర్థన మేరకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి గారు, సహాయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి గారు, రాష్ట్ర కార్య వర్గ సభ్యులు తక్కెళ్లపల్లి శ్రీనివాస్ రావు గారు పరామర్శించారు. మానవత్వంతో శ్రీహిత ను కళ్లారా చూసిన వారు శ్రీహిత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి లేఖ వ్రాసారు మరియు ముఖ్యమంత్రి కేసీఆర్ తో ప్రత్యేకంగా మాట్లాడి శ్రీహిత కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సహాయం చేయాలని సీపీఐ రాష్ట్ర పార్టీ ద్వారా విజ్ఞప్తి చేశారు