14 దేశాల మీదుగా
ప్రపంచ సైకిల్ యాత్రను అత్యంత వేగంగా పూర్తి చేసిన తొలి ఆసియన్‌గా భారత్‌కు చెందిన యువతి కొత్త రికార్డు నెలకొల్పింది. పుణేకు చెందిన 20 సంవత్సరాల వేదాంగి కులకర్ణి ఈ ఘనత సాధించింది. సైకిల్‌పై ప్రపంచ యాత్ర పూర్తి చేయడానికి 29వేల కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించాలి. ఆమె దూరాన్ని 14 దేశాల మీదుగా 139రోజుల్లో పూర్తి చేసింది. రోజుకు 300 కిలోమీటర్ల వరకూ ఆమె సైకిల్‌పై ప్రయాణించింది. ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో జులైలో ప్రారంభమైన ఈ సైకిల్ యాత్ర ఆదివారం ఉదయం కోల్‌కతాకు చేరుకోవడంతో ముగిసింది. యూకేలో చదువుకుంటున్న వేదాంగి.. రెండేళ్ల నుంచే ఈ యాత్రకు సిద్ధమైంది.
ఈ యాత్రలో ప్రపంచ రికార్డు బ్రిటన్‌కు చెందిన 38 ఏళ్ల జన్నీగ్రాహం పేరు మీద ఈ ఏడాది నమోదైంది. ఆమె 124రోజుల్లోనే యాత్ర పూర్తి చేసింది. వేదాంగి తన 139రోజుల యాత్రలో 80శాతం ఒంటరిగానే ప్రయాణించింది.