వాళ్లకి కొద్ది రోజుల క్రితమే వివాహమైంది. ఆమెకి భర్త ఎప్పుడూ తనతోనే సమయం గడపాలని ముద్దు ముచ్చటలు ఆడాలని కోరిక. అతనికేమో చిన్నప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యం. అందు కోసం భార్యను పట్టించుకోకుండా UPSC పరీక్షలకు ప్రిపేర్ అయ్యాడు. తనను పట్టించుకోకుండా నిత్యం పుస్తకాలతో ఉంటున్నాడని అతని భార్య ఏకంగా విడాకులు

పూర్తి వివరాలు: ఓ యువకుని జీవితంలో ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా , చిన్నప్పటి నుండి కేంద్ర ప్రభుత్వ సర్వీసులో కొనసాగాలనేది ఆయన పట్టుదల, అందుకే తనకు పుస్తకాలే సర్వస్వంగా భావించి యూపిఎస్సీ ఉద్యోగం కోసం అహర్నిశలు కష్టపడుతున్నాడు. అయితే ఇటివల ఆయువకుని పెళ్లి కూడ అయింది. అయినప్పటికి ఉద్యోగమే లక్ష్యంగా చదువును కొనసాగిస్తున్నాడు. అయితే చదువే యువకుడికి శాపం అయింది. కట్టుకున్న భార్య విడిచి వెళ్లిపోతానని చెబుతోంది. ఇందులో భాగంగానే పరీక్షల కోసం ఎప్పుడు పుస్తకాలతోనే కుస్తిపడుతూ…

ఇంట్లో ఉన్న భార్యను పట్టించుకోవడం లేదని యువకుడి భార్య ఆవేదన వ్యక్తం చేసింది. చదువులో పడి బిజీగా మారాడని విడాకులకు అప్లై చేసింది. ఆమె చెప్పిన కారణం విని అందరూ షాకయ్యారు. వీరి కేసును పరిశీలించిన న్యాయస్థానం ఇద్దరికీ నచ్చచెప్పడానికి ప్రయత్నించింది. ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి కలిసి ఉండాలంటూ ఇంటికి పంపించింది న్యాయస్థానం.