ప్రభుత్వ గణాంకాల ప్రకారం పశ్చిమ వరంగల్ నియోజకవర్గంలో

పశ్చిమ వరంగల్ అసెంబ్లీ నియోజకవర్గం ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఉన్నది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం పశ్చిమ వరంగల్ నియోజకవర్గంలో మొత్తం 2,33,905 ఓటర్లు ఉన్నారు. 2009 సంవత్సరంలో పశ్చిమ వరంగల్ నియోజకవర్గం నుంచి తెరాస పార్టీ తరుపున దాస్యం వినయ్భాస్కర్ గెలుపొందగా, 2014సంవత్సరపు సాధారణ ఎన్నికల్లో తెరాస పార్టీ నుంచి మళ్ళీ దాస్యం వినయ్ భాస్కర్ గెలుపొందారు.
తెలంగాణ అసెంబ్లీ రద్దు నేపథ్యంలో ముంచుకొచ్చిన ముందస్తు శాసనసభ ఎన్నికల్లో ప్రధాన పార్టీ లైన టిఆర్ఎస్, మహాకూటమి, బీజేపీ తదితర పార్టీ అభ్యర్థులతో పాటు పొత్తులో భాగంగా ‘చే’జారిన వరంగల్‌ పశ్చిమ , షాక్‌ నుంచి తేరుకోని డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌ రెడ్డి ఇక లాభం లేదు అని ఇండిపెండెంట్ గ నామినేషన్ వేశారు మరియు స్థానిక నాయకులు స్వతంత్ర అభ్యర్థులుగా తెలంగాణ-2018 ఎన్నికల బరిలో నిలుస్తుండటం విశేషం.