సొంత ఊరిలో బడిలేక.. చదువుకునేందుకు పక్క గ్రామానికి వెళ్లే విద్యార్థులకు రానున్న విద్యా సంవత్సరంలో సులువైన మార్గం లభించనుంది. కాలిబాటన బడులకు వెళ్లేవారికి చాలీచాలని రావాణా భత్యం ఇబ్బందులు తప్పనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం బడులు లేని ఆవాస ప్రాంతాల విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జనగామ, జయశంకర్‌, మానుకోట, మలుగు, వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ గ్రామీణ జిల్లాల్లోని మారుమూల పల్లెల్లోని పేద విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.