ప్రమాదకరంగా బొగత జలపాతం ప్రవాహం !!

వాజేడు: కుండపోత వర్షాలతో బొగత జలపాతం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రాతికట్టను ఆనుకుని నీటికొలను మీదుగా ప్రమాదకరంగా పొంగిపొర్లుతోంది. మండలంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు ఛత్తీస్‌గఢ్‌ అడవుల నుంచి ఉప్పెనలా వస్తున్న వరదనీటితో రాతికట్టపై నుంచి ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. పర్యాటకులు వాగులోనికి వెళ్లకుండా నీటికొలను చుట్టూ రక్షణగా అటవీశాఖ ఏర్పాటు చేసిన ఇనుప ముళ్లకంచె వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. జలపాతం సందర్శనకు వస్తున్న పర్యాటకులను వరదనీటిలోకి అధికారులు అనుమతించడం లేదు. వరద ప్రవాహం అధికంగా ఉండటంతో పర్యాటకులు సందర్శనను వాయిదా వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నిర్దేశిత ప్రదేశం నుంచే జలపాతాన్ని తిలకించాలంటూ ఆంక్షలు విధిస్తున్నారు.

వాజేడు అటవీ క్షేత్రాధికారి శంకర్‌ మాట్లాడుతూ ప్రమాదకరంగా వస్తున్న వరదనీటితో ప్రవాహం ఉద్ధృతంగా ఉందని, నీటికొలనులో ఈత కొట్టేందుకు అనుమతి లేదు. కాబట్టి జలపాతం సమీపానికి వెళ్లకుండా సిబ్బంది సూచనలను పాటించాలని పగోడా సమీపం నుంచి జలపాతాన్ని తిలకించాలని, వర్షాలు అధికంగా ఉన్నందున పర్యాటకులు రెండు రోజులపాటు జలపాతం సందర్శనను వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here