{"effects_tried":0,"photos_added":0,"origin":"unknown","total_effects_actions":0,"remix_data":["grid"],"tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":0,"crop":0,"enhance":0,"selection":0,"free_crop":0,"flip_rotate":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":0,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"lensflare":0,"clipart":0,"text":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"source_sid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1578451705482","total_editor_time":2,"total_draw_time":0,"effects_applied":0,"uid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1578451285774","total_effects_time":0,"brushes_used":0,"height":2048,"layers_used":0,"width":4096,"subsource":"done_button"}

జిల్లా యెస్.పి శ్రీమతి చందన దీప్తి ఐ.పి.యెస్ గారి ఆదేశానుసారం రోడ్డు ప్రమాదాల నివారణకు మెదక్ జిల్లా పరిదిలో కల నర్సాపూర్ సంగారెడ్డి రోడ్డులో మెదక్ జిల్లా పరిది వరకు సూచిక బోర్డలను నర్సాపూర్ పోలీసులు రోడ్డు రవాణా శాఖా వారి ఆద్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా యెస్.పి శ్రీమతి చందన దీప్తి ఐ.పి.యెస్ గారు మాట్లాడుతూ ఏటేటా జరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో మెదక్ జిల్లా పోలీసులు కొన్ని నెలల పాటు ప్రత్యేకంగా నిపుణులతో అధ్యయనం చేసి ప్రమాదాలకు గల కారణాలను గుర్తించి ప్రమాదాలను నివారించడానికి పలు సూచనలు చేస్తూ సూచిక బోర్డలను ఏర్పాటు చేయటం జరిగిందని, రోడ్డు భద్రతా సూచనలు అమలు చేయడకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, ప్రమాదకరంగా మారిన మూల మలుపుల వద్ద సూచిక బోర్డులను ఏర్పాటు చేయటంతో పాటు స్పీడ్ లిమిట్, బోర్డ్ లను ఏర్పాటు చేయటం జరిగిందని తెలిపినారు.

అదేవిదంగా రోడ్డు నియమ, నిబంధన లపై వాహనదారులతో పాటు పాదచారులకు పూర్తి అవగాహన ఉన్నప్పుడే ప్రమాదాలను నివారించడం సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో అధికశాతం మంది హెల్మెట్ ధరించకపోవడం వల్ల తలకు బలమైన గాయాలు తగిలి ప్రాణాలు కోల్పోతూ, తమ పై ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యులను మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాలు మానవ తప్పిదాల వల్ల మాత్రమే జరుగుతాయని, మనమందరం ట్రాఫిక్ నియమాలు ఖచ్చితంగా పాటించినట్లయితే చాలా వరకు రోడ్డు ప్రమాదాలు అరికట్టవచ్చు అని తెలియ చేయడం జరిగింది.