ప్రముఖ సీనియర్‌ నటుడు రాళ్లపల్లి(73) కన్నుమూశారు…

కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని మ్యాక్స్‌క్యూర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు…

850కి పైగా చిత్రాల్లో రాళ్లపల్లి ఆయన నటించారు…

రాళ్లపల్లి అసలు పేరు రాళ్లపల్లి నర్సింహారావు,1979లో ‘కుక్కకాటుకు చెప్పు దెబ్బ’తో సినీ రంగం ప్రవేశం చేశారు…

1945 ఆగస్టు 15న అనంతపురం జిల్లా కంబదూరులో రాళ్లపల్లి జన్మించారు…

సీనియర్ నటుడు రాళ్లపల్లి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో పాటు పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేసారు…