ప్రాణం మీదకు తెచ్చిన వివాహేతర సంబంధం
Advertisement
వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణం మీదకు తెచ్చింది. అతీక్ అనే వ్యక్తిపై సలీం కత్తితో దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతీక్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బేగంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని రసూల్‌పూరాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సలీం భార్యతో అతీక్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగా సలీం ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.