ఐటీ సంస్థ నిర్వాహకుడు మైలా సతీష్ ష్‌ బాబు హత్య కేసులో ప్రధాన నిందితుడిని కేపీహెచ్‌బీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. చిన్ననాటి స్నేహితుడు, వ్యాపార భాగస్వామి సతీష్‌ బాబును నమ్మించి దారుణంగా హత్య చేసిన హేమంత్‌ను పోలీసులు గుల్బర్గా వద్ద అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సతీబాబు హత్యకు ఆర్ధిక లావాదేవీలతో పాటు తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి ప్రియాంక విషయంలో ఏర్పడిన వివాదాలే కారణం కావచ్చని భావిస్తున్నారు. హేమంత్ ప్రియాంకతో సంబంధం పెట్టుకుని తన కుటుంబాన్ని కూడా దూరం చేసుకున్నాడు. ప్రియాంక సతీష్ బాబుతో కూడా సన్నిహితంగా ఉంటుందని తెలుసుకున్న హేమంత్ సతీష్ బాబును హత్య చేసి ఉంటాడని, ఇందుకు ప్రియాంక కూడా సహకరించి ఉంటుందని భావిస్తున్నారు.