ప్రియుడు, అతని స్నేహితుడు సహయంతో భర్తను అంతమందించిన భార్య వ్యవహారం సంచలనమైంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్త కానిస్టేబుల్ రమేష్ ను పక్క స్కెచ్ తో హతమార్చిన భార్య ఈ దురాగతానికి పాల్పడింది. ఇంట్లో నే పథకం ప్రకారం తలగడా దిండుతో హత్య చేసి గుండెనొప్పిగా చిత్రకరించిన భార్య శివ జ్యోతి అలియాస్ శివాని ఎట్టకేలకు దొరికింది. ట్యాక్సీ డ్రైవర్ తో వివాహితర సంబంధం పెట్టుకున్న భార్య అతడి సహాయంతోనే హత్య కు పక్కాగా ప్లాన్ చేసింది భర్తను చంపేసి గుట్టుచప్పుడుగా అంతక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేసింది భార్య.
అయితే ఆరోగ్యంగా ఉన్న కానిస్టేబుల్ హత్యకు గురికావడంతో అనుమానించిన ఎంవీపీ పోలీసులు విచారణ జరిపారు. విచారణలో వెలుగు చూసిన అక్రమ సంబంధం బాగోతంతో భార్యను తమదైన శైలిలో విచారించగా హత్యకు పాల్పడినట్టు ఒప్పుకుంది. మొత్తంగా 2009లో కానిస్టేబుల్ గా విధుల్లోకి వచ్చిన బర్రి రమేష్ భార్య అక్రమసంబంధానికి బలి అయిపోయాడు..