ప్రియుడితో కూతురు విమానం ఎక్కింది-
విరక్తితో తండ్రి రైలుకింద పడ్డాడు

తెలుగు రాష్ట్రాలలో పరువు హత్యలు కలకలం సృష్టిస్తుంటే, అనంతపురంలో కూతురు తమ పరువు తీసిందని ఓ తండ్రి రైలుకింద పడి చనిపోయాడు. పరువు కోసం అతను చేసిన ఆత్మహత్య తీవ్ర సంచలనం సృష్టించింది. అనంతపురం జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారి భరత్ కి ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు రూపాలిని విజయవాడకు చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. రెండో కూతురు పేరు సోనాలి నిన్న మధ్యాహ్నం సిద్ధార్థ రాయ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుని బెంగళూరుకు వెళ్లిపోయింది.

తాను ప్రేమ వివాహం చేసుకుని భర్తతో వెళ్లిపోతున్నానని తన గురించి వెతకవద్దని తండ్రికి మెసేజ్ చేసిందికూతురు సోనాలి. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన భరత్ ఇంటి దగ్గర నుంచి వెళ్లిపోయి అనంతపురం సమీపంలోని గార్లదిన్నె రైల్వే ట్రాక్ పై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.