ఉత్తర్ప్రదేశ్ లోని చాంద్ పూర్ ఓ మహిళ నివాసం ఉంటుంది. ఆమె చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి ఓ కొడుకు(10) జన్మించాడు. ఇక పుట్టిన కుమారుడిని చదివించుకుంటూ సంసారం ఈడ్చుకుంటూ వస్తున్నారు. అంతా బాగానే ఉందనుకున్న తరుణంలోనే ఆ మహిళ పక్క చూపులు చూసింది. ఇంట్లో మొగుడితో చాలదన్నట్లుగా పరాయి పడక సుఖానికి తెరలేపింది. ఈ మహిళ స్థానికంగా ఉండే టింకు అనే వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని నడిపించింది. భర్త పనికి వెళ్లడం, కుమారుడు స్కూల్ కు వెళ్లడంతో వెంటనే ప్రియుడిని ఇంటికి పిలిపించుకుని ఎంజాయ్ చేసేది. ఇలా ఈ మహిళ చీకటి కాపురం గత కొన్నాళ్లుగా సాగింది. ఇదిలా ఉంటే ఇటీవల ఆ మహిళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రియుడిని తన ఇంటికి పిలిపించుకుంది. ఇక ప్రియుడు రాగానే అతనితో బెడ్ రూంలో తెగ రొమాన్స్ చేయసాగింది.
ఈ సమయంలోనే ఉన్నట్టుండి ఆ మహిళ కుమారుడు ఇంటికి వచ్చాడు. అతనికి బెడ్ రూంలో ఏదో శబ్దం వినిపించడంతో మెల్లగా తలుపులు తీసి చూడగా తల్లి ప్రియుడితో నగ్నంగా ఆ స్థితిలో కనిపించింది. ఆ సీన్ చూసిన ఆమె కుమారుడు ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. కోపంతో ఊగిపోయిన కుమారుడు నాన్నకు చెబుతానని తల్లితో చెప్పాడు. ఇది విన్న ఆ మహిళ భయంతో వెంటనే ఇంటి తలుపులు వేసింది. అనంతరం ఆ మహిళ, ప్రియుడి కలిసి ఆ బాలుడిని గొంతు పిసికి హత్య చేశారు. ఆ తర్వాత కుమారుడిని శవాన్ని ఎవరికీ కనిపించకుండా ఓ చోట విసిరేశారు. ఆ శవాన్ని చూసిన కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని పరిశీలించి తల్లిని విచారించారు. కానీ తల్లి మాత్రం పొంతనలేని సమాధానాలు భయంతో చెప్పింది. ఎందుకో పోలీసులకు తల్లిపై అనుమానం వచ్చింది. ఏం జరిగింది పోలీసులు గట్టిగా ప్రశ్నించగా నేను నా ప్రియుడితో ఉండగా నా కుమారుడు చూశాడని, ఈ విషయాన్ని ఎవరికైన చెబుతాడనే భయంతో అతడిని చంపేశానని ఆ మహిళ ఒప్పుకుంది. విచారణ అనంతరం పోలీసులు ఆ మహిళతో పాటు ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.