ప్రియుడిని చంపి , ముక్కలుగా కోసి , బిర్యానీ చేసి

యూఏఈలో భవన నిర్మాణం జరుగుతున్న ప్రాంతమది. కార్మికులంతా పాకిస్థానీలు. ఓ రోజు వీరికి స్థానిక సంప్రదాయం ప్రకారం మాంసంతో కలిపి వండిన బిర్యానీ వడ్డించారు. కానీ అందులో వాడిన మాంసం మనిషిదని ఆ తిన్న వారందరికీ తెలీదు. ఈ విషయం వారికి వడ్డించిన 30 ఏళ్ల మోరాకో మహిళకు మాత్రమే తెలుసు. ఎందుకంటే ఆమె తన ప్రియుణ్ని చంపి. అతని శరీర భాగాలతోనే ఆ బిర్యానీ చేసింది. అబుధాబీకి చెందిన ఓ వార్తాసంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం. ఆ మహిళ తన ప్రియుడితో ఏడేళ్లుగా సహజీవనం చేస్తోంది. అతను మరో మహిళను పెళ్లి చేసుకొనేందుకు సిద్ధం కావడంతో అతడిని హత్య చేసింది. అంతటితో ఆగకుండా శరీరంలో కొన్ని భాగాలను ముక్కలు చేసి బిర్యానీలో వేసి వండింది. మిగిలిన మృత దేహాన్ని సమీపంలో సంచరించే కుక్కలకు వేసినట్లు మహిళ విచారణలో చెప్పిందని ‘ఖలీజ్‌ టైమ్స్‌’ పేర్కొంది.
నెల రోజుల క్రితమే ఈ ఘటన జరగ్గా.. సోదరుడు కనిపించడం లేదన్న మృతుడి అన్నయ్య.. సదరు మహిళ ఇంటి వద్ద తనిఖీ చేయడంతో విషయం వెలుగులోకొచ్చింది. తొలుత మహిళను ప్రశ్నించగా.

తనకేమీ తెలియదని చెప్పింది. ఆమె ఇంట్లోనే హతుడి దంతాలు కనిపించడంతో అనుమానం వచ్చి మృతుడి సోదరుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. నిందితురాలి ఇంట్లో దొరికిన దంతాలను డీఎన్‌ఏ పరీక్ష కోసం పంపగా అవి మృతుడివేనని తేలింది.