ప్రేమించి మోసం చేసిన ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు దీక్ష చేపట్టింది. జనగాం మరిగెడి గ్రామానికి చెందిన అనూష (19) కు అదే ప్రాంతానికి చెందిన, ప్రశాంత్ తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వీరిద్దరూ నగరానికి వచ్చారు. అతడు మారేడ్‌పల్లిలో నివసిస్తుండగా, ఆమె కూకట్‌పల్లిలో ఓ హాస్టల్‌లో ఉంటోంది. తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ప్రశాంత్‌ మోసం చేశాడని 2017లో చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో తాను మైనర్‌ కావడంతో ప్రేమ పెళ్లికి అభ్యంతరం తెలిపారని వివరించింది. తనకు తెలియకుండా ప్రశాంత్‌ ఇటీవల వివాహం చేసుకున్నాడని, న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ అతడు నివసిస్తున్న రూమ్‌ వద్ద దీక్ష చేపట్టింది. సమాచారం అందుకున్న మారేడ్‌పల్లి పోలీసులు అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు చిలకలగూడ పోలీ్‌సస్టేషన్‌లో ఉన్నందును ఆ PS‌ పోలీసులకు ఫిర్యాదు చేయాలని బాధితురాలికి నచ్చజెప్పి ఆమెను అక్కడికి పంపించారు.