ప్రేమ మనసులో ఎప్పుడు,ఎందుకు ,ఎలా మొలకెత్తుతుందో తెలియదు, అలాంటిదే ఈ ప్రేమ, పెళ్లి, ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైన మరుగుజ్జును యువతి ప్రేమ వివాహం చేసుకుంది. అనంతరం రక్షణ కల్పించాలని కోరుతూ కరూర్‌ మహిళా పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించారు. వివరాలు శుక్రవారం వెల్లడయ్యాయి. కరూర్‌ సమీపంలోని తేరూరుకు చెందిన విఘ్నేశ్వరన్‌ (25) నాలుగు అడుగుల ఎత్తు ఉన్నాడు.

Advertisement

ఓ ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి ఫేస్‌బుక్‌లో శివగంగైకు చెందిన ఫార్మసీ విద్యార్థిని పవిత్రతో పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారింది. మూడేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరు వివాహం చేసుకునేందుకు నిర్ణయించారు. ఇందుకు ఇరు కుటుంబాలు వ్యతిరేకత తెలిపాయి. ఇలా ఉండగా బుధవారం కరూర్‌ ఈశ్వరన్‌ ఆలయంలో పవిత్రను విఘ్నేశ్వరన్‌ వివాహం చేసుకున్నాడు. అనంతరం తమకు భద్రత కల్పించాలని కోరుతూ కరూర్‌ మహిళా పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించారు.