ప్రేమకు ఓకే చెప్పింది – పెళ్లి వద్దంది …

ప్రేమించిన యువతి మోసం చేసిందనే కారణంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసిన మృతుని స్నేహితులు, మోసం చేసిన యువతిని శిక్షించాలంటూ మృతదేహంతో నిరసన తెలిపారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ఈ ఘటన జరిగింది. గాంధీనగర్ కు చెందిన పంతొమ్మిదేళ్ల రామగిరి రోహిత్ అనే యువకుడు.. ఈ ఉదయం తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అగ్రవర్ణానికి చెందిన ప్రియురాలు మోసం చేసిన కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నానని.. ఆమెను పోలీసులు కఠినంగా శిక్షించాలంటూ సూసైడ్ నోట్ రాశాడు.

ప్రేమించిన అమ్మాయిది కూడా హుజూరాబాద్ పట్టణమే అని స్థానికులు చెప్పారు. ఇద్దరూ కొన్నాళ్లుగా ప్రేమించుకుని సన్నిహితంగా మెలిగారని తెలిసినవాళ్లు చెబుతున్నారు. అబ్బాయి ఇంటర్ పూర్తిచేశాడు. అమ్మాయి హైదరాబాద్ లో బీటెక్ చదువుతోంది. ఇద్దరివి వేర్వేరు కులాలు కావడంతో పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని అమ్మాయి చెప్పడంతో కొద్దిరోజులుగా రోహిత్ మనోవేదనలో ఉన్నాడు. యువతి ఇంట్లో వాళ్లతో మాట్లాడినా అంగీకరించలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు.