సాధారణంగా ఒక తెలుగు అమ్మాయి ఒక తెలుగు జిల్లాకు ఎస్పీగా నియమితులవ్వడం చాలా అరుదు. అలాంటిది ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూర్ జిల్లాకు చందన దీప్తి అనే అమ్మాయి ప్రస్తుతం మెదక్ జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో వరంగల్‌లో సంచలనం సృష్టించిన యాసిడ్ దాడి ఘటన తర్వాత ఐపీఎస్ కావాలని కలలు కన్న ఆమె 2012లో తన కలను సాకారం చేసుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న యువ పోలీస్ అధికారుల్లో ఆమె కూడా ఒకరు. ఎస్పీగా మెదక్ జిల్లాలో ఎన్నో సంస్కరణలు చేపట్టి అనేక సార్లు వార్తల్లో నిలిచారు. ఒక ఆసక్తికర ప్రకటనతో ఇప్పుడు మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ప్రేమపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రేమ అంటే కేవలం సరదా కోసమే కాదని, కష్టకాలంలో కూడా ఒకరికొకరు తోడుగా ఉండటమే నిజమైన ప్రేమ అని అన్నారామె. తనకు పెళ్లైపోయిందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపైనా స్పందించారు. తనకు ఇంకా పెళ్లి కాలేదని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుందని క్లారిటీ ఇచ్చారు. ఇక తన పెళ్లి విషయం గురించి మాట్లాడుతూ, తనకు ప్రేమ పెళ్లి చేసుకోవడం ఇష్టమే కానీ, సోషల్ మీడియాలో తనకు పెళ్లైపోయిందని జరుగుతున్న ప్రచారంతో సరైన వ్యక్తి దొరకట్లేదన్నారు. తనను ఎవరైనా ఇష్టపడ్డా, పెళ్లైపోయిందన్న వార్తలతో తనను కాంటాక్ట్ చేయట్లేదమోనని సరదాగా కామెంట్ చేశారు. దానికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది…