ప్రేమించిన యువతితో పెళ్ళిచెయ్యాలనిఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి నానా రభస సృష్టించాడు. మదనాపురానికి చెందిన శ్రీధర్‌ తాను ప్రేమించిన యువతితో పెళ్లి చేయాలని స్థానిక రైల్వేస్టేషన్‌ సమీపంలో ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్‌ సెల్‌టవర్‌ ఎక్కి పలువురిని బెదిరించాడు. దాంతో అక్కడ కాసేపు గందరగోళం నెలకొంది. గ్రామం మొత్తం వ్యాపించడంతో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. స్నేహితులు, తల్లిదండ్రులు, బంధువులు ఎంతనచ్చజెప్పినా అతడు వినిపించుకోకుండా అక్కడే భీష్మించి కూర్చున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని నచ్చజెప్పినా ఫలితం లేకపోవడంతోచేసేదేమి లేక స్నేహితులు, పోలీసులు నీవు ప్రేమించిన యువతితోనే పెళ్లి చేయిస్తామని హామీ ఇవ్వడంతో యువకుడు కిందకి దిగాడు. అనంతరం పోలీసులు యువకుడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి నచ్చజెప్పారు.