ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యతో పాటు నాలుగేళ్ల కుమారుడిపై ఓ వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటన
వివరాలు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామానికి చెందిన మంచాల రమేశ వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలానికి చెందిన కందిగ సుశ్రుత (27) ను 2015లో ప్రేమ వివాహం చేసుకొన్నాడు. వీరికి నాలుగునెలల బాబు ఉన్నాడు. కొన్ని నెలల పాటు సజావుగానే సాగిన, వీరి మధ్య ఇటీవల మనస్పర్థలు తలెత్తాయి. దాంతో ఎనిమిది నెలలుగా వేరుగా ఉంటున్నారు. వికారాబాద్‌లోని సోలార్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉప్పల్‌లో నివసిస్తున్న రమేశ్‌ను కాపురానికి తీసుకెళ్లమంటూ సుశ్రుత కొన్నిరోజులుగా ఒత్తిడి పెంచింది. ఎంతకూ పట్టించుకోకపోవడంతో శనివారం ఉప్పల్‌లోని ఆయన ఇంటికి వచ్చింది. వారిద్దరిని తన బైక్‌పై ఘట్‌కేసర్ ఔటర్‌రింగ్‌రోడ్డు వద్దకు తీసుకురాగా, ఇద్దరి మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది.
ముందస్తు పథకం ప్రకారం వెంటతెచ్చుకొన్న నిద్రమాత్రలను భార్యతో మింగించి, చిన్నారికి పాలల్లో కలిపి తాగించాడు. ఇద్దరు అపస్మారకస్థితిలో వెళ్తుండటాన్ని గమనించిన రమేశ్ వారిని కొండాపూర్ గ్రామ పరిధిలోని ప్రభాకర్ ఎన్‌క్లేవ్ వెంచర్ లోనికి తీసుకెళ్లాడు. అక్కడే జాతీయ రహదారి ప్రక్కన ఉన్న బంకులో పెట్రోలు కొనుగోలు చేసి తీసుకెళ్లాడు. జాతీయ రహదారి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోని దాసు అనే రైతు వ్యవసాయ క్షేత్రం వద్ద ఇద్దరిని గొంతునులిమి హత్యచేశాడు. అనంతరం మృతదేహాలపై పెట్రోలు పోసినిప్పంటించాడు. అక్కడి నుంచి పాలకుర్తికి వెళ్లి అక్కడి పోలీసుల ఎదుట రమేశ్ లొంగిపోయాడు.
ఘటన ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగినందున నిందితుడు రమేశ్‌ను ఘట్‌కేసర్ పోలీసులకు అప్పగించారు. తన పొలంలో గుర్తుతెలియని వ్యక్తుల మృతదేహాలను కాల్చినట్టు రైతు దాసు తెలుపడంతో పోలీసులు ఆదివారం సంఘటన స్థలాన్ని సందర్శించి పంచనామా నిర్వహించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఘట్‌కేసర్ CI రఘువీర్‌రెడ్డి తెలిపారు.