సికింద్రాబాద్ యశోదకు చేరుకున్న వరంగల్ ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ రవళిని. యశోద ఆస్పత్రిలో పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి.. మెరుగైన వైద్యం అందించాలంటు యశోద ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడి ప్రభుత్వం అన్నీ చూసుకుంటుందని ఎలాంటి ఆటంకం కలగకుండా వైద్యం కొనసాగించాలని కోరి రవళి కుటుంబసభ్యులకు భరోసా కల్పించినారు. అనంతరం మీడియా సమావేశంలో పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ దాడి చేసిన నిందుతుడిని అదుపులోకి తీసుకున్నారని, చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.. కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లానని, ఎంత ఖర్చైనా ప్రభుత్వం భరించి రవళి కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని అన్నారు..