ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన డిగ్రీ విద్యార్థిని రవళి(20) మృతిచెందింది. సికింద్రాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం కన్నుమూసింది. వరంగల్‌లో అన్వేష్‌ అనే ప్రేమోన్మాది.. రవళిపై ఎనిమిది రోజుల క్రితం పెట్రోల్‌ పోసి నిప్పంటించడంతో ఆమె తీవ్రగాయాలపాలైంది. మెరుగైన వైద్యం కోసం రవళిని సికింద్రాబాద్‌ యశోదా ఆస్పత్రికి తరలించగా.. అప్పటి నుంచి ఇక్కడే చికిత్స పొందింది. ఈక్రమంలో ఇవాళ ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో మరణించింది. అన్వేష్‌ను ఉరితీయాలని రవళి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.