అమరావతిలో జ్యోతి ఘటన మరువకముందే అటువంటిదే మరోటి వెలుగుచూసింది. ప్రేమజంటపై గుర్తుతెలియని దుడగులు దాడి చేయడంతో ప్రియురాలు మృతిచెందింది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం జీలకర్రగూడెంలో జరిగింది. స్థానిక ప్రాంతంలో బౌద్దారామం ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని సందర్శించేందుకు వచ్చిన ప్రేమజంటపై గుర్తుతెలియని దుండగులు తీవ్రంగా దాడి చేశారు. బండరాళ్లతో వారిద్దరిపై మోదడంతో యువతి అక్కడికక్కడే మృతిచెందింది. యువకుడు రక్తపు మడుగులో కొనఊపిరితో పడిఉన్నాడు. అతని అరుపులు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వైద్యం నిమిత్తం యువకుడిని ఏలూరు ఆసుపత్రికి తరలించారు.