{"effects_tried":0,"photos_added":0,"origin":"unknown","total_effects_actions":0,"remix_data":[],"tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":0,"crop":0,"enhance":0,"selection":0,"free_crop":0,"flip_rotate":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":0,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"lensflare":0,"clipart":0,"text":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"source_sid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1578667239565","total_editor_time":139,"total_draw_time":0,"effects_applied":0,"uid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1578667221817","total_effects_time":0,"brushes_used":0,"height":2048,"layers_used":0,"width":4096,"subsource":"done_button"}

హన్మకొండలోని రాంనగర్ లో హారతి అనే యువతిని గొంతుకోసి చంపిన షాహిద్ అనే యువకుడు ప్రభుత్వ లు ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. అకృత్యాలు ఆపేందుకు నిర్భయ చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. అయినా ఏ మాత్రం భయపడటం లేదు. తాజాగా హన్మకొండ రామ్‌నగర్‌లో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. యువతి గొంతుకోసి పరారయ్యాడు. అనంతరం నిందితుడు జడ్జి ఎదుట లొంగిపోయాడు యువతి అక్కడికక్కడే మృతి చెందింది.

హారతి-షాహీద్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు .యువతి మరొకరితో సన్నిహితంగా ఉండడం తో అనుమానం తో బ్లేడ్ తో గొంతు కోసి హత్య చేసిన నిందితుడు. హన్మకొండ లో లష్కర్ సింగారం కి చెందిన మునిగాల హారతిని కాజీపేట కు చెందిన మొహమ్మద్ షాహిద్ .నిందితుడు కాజీపేటలోని చైతన్య పురి కాలనీలో రజాక్ మటన్ షాప్ లో పని చేస్తున్నాడు, నిందితుడు బాధితురాలు ఇద్దరు ప్రేమికులు వీరు మాస్టర్ జీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. సంఘట స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ జరుపుతున్నారు…

హారతి కుటుంబ సభ్యులను పరామర్శ

హన్మకొండ రాంనగర్ లో మునిగాల హారతి దారుణ హత్య ఘటనపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినాయభాస్కర్ తో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. చట్టప్రకారం వేగంగా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. హారతి కుటుంబ సభ్యులను పరామర్శించారు.