పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న లక్నవరాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దుదామని టూరిజం డెవలప్‌మెంట్ ఎండీ బోయినపల్లి మనోహర్‌రావు పేర్కొన్నారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం లక్నవరాన్ని మంగళవా రం ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లా సీసీఎఫ్ ఎండీ అక్బర్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మనోహర్‌రావు మాట్లాడుతూ.. పర్యాటకుల సౌకర్యార్థం జింకల పార్కు నుంచి లక్నవరం పార్కింగ్ స్థలం వరకు మరో రోడ్డును ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. ములుగు జిల్లా పర్యాటక రంగంలో తలమానికం కానున్నదని చెప్పారు.