పవన్ తో అలీ భేటీ
టాలీవుడ్ కమెడియన్ అలీ, త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని వార్తలు వస్తున్న వేళ, ఈ ఉదయం ఆయన స్వయంగా వెళ్లి పవన్ కల్యాణ్ ను కలవడం హాట్ టాపిక్ అయింది. తన గురువు, మార్గదర్శకుడిగా పవన్ ను చెప్పుకునే అలీ, నేడు పవన్ తో భేటీ అవడం కొత్త చర్చలకు దారి తీసింది. అనంతరం ఆలీ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు.
కాగా, రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్న అలీ, అందుకు సంబంధించి పవన్ సలహాలు అడిగి ఆశీర్వాదం తీసుకునేందుకే వచ్చారని తెలుస్తోంది. దాదాపు రెండు గంటల పాటు వీరి సమావేశం జరిగింది. మూడురోజుల క్రితం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఆలీ కలిసిన విషయం తెలిసిందే.