సీఎం కేసీఆర్ పాలనలో మనమందరం భాగ స్వాములమై బంగారు తెలంగాణ దిశగా పని చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్ పల్లి వినోద్ కుమార్ టీఆర్ఎస్ నాయకులు , కార్యకర్తలకు సూచించారు . తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి సారిగా నగరానికి విచ్చేసిన బోయిన్ పల్లి వినోద్ కుమార్ ను ఆయన స్వగృహంలో రాష్ట్ర నాయకుడు నార్లగిరి రమేశ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు , కార్యకర్తలు బుధవారం కలిసి పుష్ప గుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు .

అనంతరం వినోద్ కుమార్ మాట్లాడుతూ . . తెలంగాణ ఉద్యమం , పార్టీలో మొదటి నుంచి పని చేసిన నాయకులు , కార్యకర్తలకు తప్పకుండా న్యాయం జరుగుతుందన్నారు . ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ , జిల్లా నాయకులు గబ్బెట శ్రీనివాస్ , అఫ్ఘల్ , మిట్టపల్లి రమేశ్ కుమార్ , కొండ్ర శంకర్ , కర్ణకంటి నర్సింహాచారి , సిరిపాక కుమార్ , చీకటి ఆనంద్ తదితరులు పాల్గొనారు .