బంగాళాఖాతంలో మీరో అల్పపీడనం! తెలంగాణకు భారీ నుండి అతి భారి..

అల్పడీపనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం

కోస్తా, తెలంగాణ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు

హెచ్చరించిన వాతావరణ శాఖ అధికారులు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. సముద్రంలోని వాయవ్య పరిసర ప్రాంతాల్లో ఇది క్రమంగా బలపడుతోందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

రేపు ఉదయానికి ఇది వాయుగుండంగా మారుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు.

ఇదే సమయంలో అల్పపీడనానికి అనుబంధంగా సుమారు 7.6 కి. మీ ఎత్తులో నైరుతి దిశగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని,

దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని అన్నారు.

ముఖ్యంగా కోస్తా ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల్లో ఓ మోస్తరు లేదా భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.

తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవాళ, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే సెప్టెంబర్‌ 2న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పలుచోట్ల వర్షం కురుస్తోంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో భారీ వర్షం కురిసింది. దీంతో వర్షపునీరు శివాలయం గర్భగుడిలోకి చేరింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here