
ఆపదలో సహాయం కోరి తెలిసిన వారి ఇంటికి వచ్చిన జూనియర్ ఆర్టిస్ట్‌ను బెదిరించి అత్యాచారానికి పాల్పడిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారంః యాక్టింగ్‌పై మక్కువతో సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్న యువతి తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి యూసుఫ్ గూడ పరిధిలోని కృష్ణా నగర్లో నివాసం ఉంటోంది. ఈ నెల 7న తన ఇంటి అద్దె కోసం దాచుకున్న రూ.5000 కనపడకుండా పోవడంతో తాను పని చేసే యజమాని బాలు నాయక్‌ను అప్పు అడిగింది.
తన ఇంటికి వస్తే అప్పు ఇస్తానని బాధిత యువతి తెలపడంతో కృష్ణా నగర్లో బాలు నాయక్ ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్లిన తర్వాత బాలు నాయక్ తన కోరిక తీరిస్తే డబ్బులు ఇస్తానని చెప్పడంతో యువతి నిరాకరించింది. దీంతో బాలు నాయక్ యువతిని అసభ్యంగా తిడుతూ, బలవంతంగా అత్యాచారం చేశాడు. జరిగిన విషయాన్ని యువతి తన బాయ్ ఫ్రెండ్‌కు చెప్పగా మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.