బకెట్‌లో పడి చిన్నారి మృతి

శ్రీవేద అనే చిన్నారి బకెట్‌లో పడి మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. కోనరావుపేట గ్రామానికి చెందిన రంగు రాజు, లహరి దంపతులు కొన్నేళ్ల కిందట మెట్‌పల్లికి వచ్చి స్థిరపడ్డారు. వీరికి నాలుగేండ్ల కొడుకు, 15 నెలల కూతురు శ్రీ వేద సంతానం. శుక్రవారం సాయంత్రం ఇంటి ఆవరణలో చిన్నారి ఆడుకుంటూ బకెట్‌లో చేతులు చాచి వస్తువును తీసుకునే క్రమంలో అదుపు తప్పులో బకెట్‌లో ఉన్న నీళ్లలో పడింది. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తల్లి లహరికి బకెట్‌లో పడి ఉన్న శ్రీవేద కన్పించడంతో షాక్‌కు గురైంది. అప్పటికే శ్రీవేద మృతి చెందింది. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.

స్థానిక ఎస్‌ఐ శంకర్‌రావు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.