నిన్న పెళ్లి నేడు ఆత్మహత్యాయత్నం

వేలంటైన్స్‌ డే సందర్భంగా నిన్న పార్కుల్లో కనిపించిన ప్రేమ జంటలకు భజరంగ్‌దళ్‌ పెళ్లి జరిపించింది. హైదరాబాద్‌లో ఇలా వారు పెళ్లి జరిపించిన ఓ ప్రేమ జంట ఇవాళ ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. ట్యాంక్‌ బండ్‌లో దూకి ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు కాపాడారు. యువతి, యువకుడి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చిన పోలీసులు, వారిద్దరికీ కౌన్సెలింగ్‌ ఇచ్చారు. పెళ్లి చేసినప్పటి నుంచి దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ యువతి, యువకుడు ఇంటికి కూడా వెళ్లలేదు. ఈక్రమంలో ఇవాళ ఆత్మహత్యకు యత్నించారు.