మార్కాపురంలో ఎస్సీ బీసీ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. పుట్టినరోజు వేడుకలకు తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వలేదని ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఎస్సీ బీసీ కాలనీకి చెందిన మురారి జలయ్య, తల్లి లక్ష్మి కుమారుడు ప్రసాద్ బర్తడే వేడుకలకు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో తల్లిదండ్రులపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. దీంతో తండ్రి మురారి జలయ్యతో పాటు తల్లి లక్ష్మి, నాయనమ్మకు గాయాలు అయ్యాయి. వెంటనే వారిని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తండ్రి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ ఘాతుకానికి పాల్పడిన ప్రసాద్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు…