క్రేజీ హీరోయిన్ సాయి పల్లవి నటించిన కొన్ని సినుమాలు ఈ మధ్య ఫెయిల్ అయినా ఆమె క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. దీనితో ఆమె బయటకు వస్తే చాలు ఆమెను చూడటానికి జనం ఎగబడతారు. అయితే సాయి పల్లవి ఒక బస్ స్టాండ్ లో నుంచుని ఒక బస్ కోసం ఎదురు చూస్తూ నిలబడి ఉన్నా ఆమెను జనం పట్టించుకోని షాకింగ్ వరంగల్ బస్ స్టాండ్ లో జరిగింది. అత్యంత సామాన్యంగా సాధారణమైన లంగా వోణీ వేసుకుని జుత్తుకు బాగా ఆయిల్ రాసుకుని జడ వేసుకుని సాధారణ యువతిగా బస్ కోసం ఎదురు చూస్తున్న సాయి పల్లవి వేణు ఉడుగుల దర్శకత్వంలో నటిస్తున్న మూవీ కోసం ఈ షాట్ జనం మధ్య తీసారు. ఆ స్పాట్ లో షూటింగ్ జరుగుతున్న విషయం ఎవరికీ తెలియకుండా ఆ బస్ స్టాండ్ కు ఎదురుగా ఉన్న బిల్డింగ్ నుండి షూట్ చేసారు.

అయితే అలాంటి గెటప్ లో ఉన్నప్పటికీ ఒక వ్యక్తి సాయి పల్లవిని గుర్తించి ఆమె లుక్ ను తన సెల్ ఫోన్ లో దూరంగా ఉండి షూట్ చేసి ఇప్పుడు ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది. ఆ సీన్ షూటింగ్ ముగిసిన వెంటనే సాయి పల్లవి జనం తనను గుర్తించేలోపే అక్కడ రెడీగా ఉన్న ఒక బస్ ఎక్కి వెళ్ళిపోయింది.
ప్రస్తుతం సాయి పల్లవి రానాతో కలిసి నటించ వలసిన ‘విరాటపర్వం’ షూటింగ్ లో నటిస్తూ రానా లేకుండానే తన సీన్స్ పూర్తి చేస్తోంది. ఈ నెల రెండవ వారం నుండి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్యతో మరొక సినిమాలో నటించడానికి రెడీ అవుతోంది. ఇప్పుడు ఈ సంఘటన వెలుగులోకి రావడంతో సాయి పల్లవి ఎలాంటి పాత్రలో అయినా నటించి మెప్పించగలదు అన్న విషయం మరొకసారి రుజువైంది..