బస్సును టిప్పర్‌ ఢీకొట్టడంతో బస్సులో ఉన్న ఐదుగురు ప్రయాణికులకు గాయాలైనయి.

హన్మకొండ నుంచి పాలకుర్తికి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. శివునిపల్లి శివారులో ఇప్పగూడెం నుంచి హన్మకొండకు కంకర లోడ్‌తో వెళ్తున్న టిప్పర్‌ అదుపుతప్పి బస్సును ఢీకొట్టింది. ఈ సంఘటనలో బస్సు ముందు భాగం ధ్వంసమైంది. బస్సులో ప్రయాణిస్తున్న స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం కొత్తపల్లికి చెందిన దంపతులు వెంకటస్వామి, మల్లికాంబ, పాలకుర్తికి మండలం మల్లంపల్లికి చెందిన అంశీ, వృద్ధురాలు రాజమ్మ, కండక్టర్‌ అశోక్‌కు గాయాలయ్యాయి. గ్రామస్థులు వారిని చికిత్స నిమిత్తం స్టేషన్‌ఘన్‌పూర్‌లోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. ఎస్సై రవి సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజిరెడ్డి తెలిపారు.