తాను పనిచేసే టైలరింగ్ యజమాని ఎండి రజాక్ రెడ్డి కాలనీకి ఎస్సార్ నగర్ కు చెందిన వెంకటేశ్వర్లు రూ.2 లక్షలు అప్పు ఇవ్వడమే కాకుండా ఇచ్చాడు. తర్వాత తన బంధువుల వద్ద నుండి సైతం మరో రూ.6 లక్షల రూపాయలు అప్పు ఇప్పించాడు. తర్వాత బంధువులు రెండు సంవత్సరాల నుండి అప్పు తిరిగి చెల్లించడం లేదంటూ ఒత్తిడి చేయడంతో టైలర్ వెంకటేశ్వర్లు పోలీసులను ఆశ్రయించాడు.
అయినా ఫలితం లేకపోవడంతో రజాక్ గడువు కాలంలో డబ్బులు చెల్లించక లేకపోవడంతో ఎంజీఎం సెంటర్ లోనే సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు. డబ్బులు చెల్లించే వరకు దిగేది లేదని.. పెట్రోల్ పురుగుల మందు పట్టుకొని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. రంగంలోకి దిగిన పోలీసులు, ఫైర్ సిబ్బంది డబ్బులు మేము ఇప్పిస్తామని ఒప్పించి కిందకి దింపారు. కిందికి దిగిన అడపా వెంకటేశ్వర్లును స్టేషన్ ను తరలించి ఎండీ రజాక్ ను పిలిపించి డబ్బులు ఇప్పించే పని చేస్తున్నారు పోలీసులు.