బాణాసంచాలు కాల్చడంలో నియమ నిబంధనలు పాటించాలి
వరంగల్ పోలీస్ కమిషనర్ డా.వి.రవీందర్
దీపావళి పండుగ సందర్బంగా బాణాసంచాలు కాల్చడంలో ప్రజలు నియమ నిబంధనలను పాటించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ డా.వి.రవీందర్ తెలిపారు. దీపావళి సందర్బంగా ప్రజలు భారత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలనుసారం, రాత్రి 8గంటల నుండి 10గంటల వ్యవధిలోపే బాణా సంచాలను కాల్చాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.
వరంగల్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలు దీపావళి పండుగను పురస్కరించుకోని సుప్రీంకోర్టు మరియు పర్యావరణ శాఖ ఆదేశాల మేరకు పెద్ద శబ్దాలు వచ్చే బాణాసంచాలతో పాటు ఇతర రకాల బాణాసంచాలను రోడ్లపైన కాని ప్రజల తిరిగే ప్రాంతాల్లో కాల్చరాదని, ఆదేవిధంగా దీపావళీ పండుగ సందర్బంగా ప్రజలు కేవలం రాత్రి 8గంటల నుండి 10గంటల వరకు మాత్రమే బాణాసంచాలు కాల్చుకోవల్సి వుంటుందని అదేశించారు.
ఈ ఉత్తర్వులు రేపు అనగా 6వ తేది ఉదయం 6గంటలను నుండి 9వ తారీఖు ఉదయం 6 గంటల వరకు అమల్లో వుంటుందని పోలీస్ కమిషనర్ తెలిపారు. సుప్రీంకోర్టు అదేశాలు మరియు సిటి పోలీస్ చట్టం ప్రకారం ఈ ప్రకటన జారీచేయడమైనది.