మంచు లక్ష్మి భారతీయ నటి, నిర్మాత. ఈమె నటుడు మోహన్ బాబు కుమార్తె. ఈమె పూర్తిపేరు మంచు లక్ష్మీ ప్రసన్న. లక్ష్మి సినిమాల్లోనే కాదు సోషల్ మీడియా లో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తమ వ్యక్తిగత జీవిత విషయాలను పంచుకుంటూ ఉంటుంది. అలాగే లక్ష్మి కు యూట్యూబ్ లో ఓ ఛానల్ కూడా ఉంది. ఆ చానల్లో ఎప్పుడూ హోమ్ టూర్లు, వ్లోగ్స్ మొదలైనవి చేస్తూ ఉంటుంది. ఆ వీడియోలో ఎంతో అల్లరి చేస్తూ కనిపిస్తూ ఉంటుంది. తాజాగా ఆమె ఓ వీడియోని షేర్ చేసింది.

ఆ వీడియోలో ఆమె గంగా నదిలో స్నానం చేస్తూ కనిపించింది. గంగా నదిలో స్నానం చేయడానికి భయపడుతూ భయపడుతూనే ఓవర్ చేస్తూనే ఎంతో ఉల్లాసంగా, ఆనందంగా గంగా నది లో మునిగింది. గంగా నదిలో ఆమె స్నానం చేసి ఆ తర్వాత దేవుడికి దండం పెట్టుకుంది. ఆ తర్వాత ప్రేక్షకులందరికీ ఆ నీరు ఎలా ఉన్నాయి గంగా నది ఎలా ఉందో చూడండి అంటూ నది మొత్తాన్ని చూపించింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.