బార్యపైఅలిగి, చావుబ్రతుకుల్లో

Advertisement

బార్యపైఅలిగి, చావుబ్రతుకుల్లో

మహిళా పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకోవడంతో కరెంట్ షాక్‌తో కింద పడిపోయాడు. చికిత్స కోసం అతడిని ఆస్పత్రికి తరలించారు. డిచ్‌పల్లి మండలం ధర్మారం గ్రామానికి చెందిన రవికాంత్ బర్దిపూర్‌కు చెందిన లక్ష్మితో 2010లో వివాహం జరిగింది. వీరికి ఓ పాప కూడా ఉంది. గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. దీంతో పోలీస్‌స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు చేసుకోగా కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలో బుధవారం కూడా కౌన్సెలింగ్‌కు హాజరైన రవికాంత్‌, ఆత్మహత్యకు యత్నించాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.।।

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here