హైదరాబాద్‌: గణపతి లడ్డూ వేలం పాటలో సరికొత్త రికార్డు నెలకొంది. బాలాపూర్‌ లడ్డూనీ మించిపోయిన వినాయక్‌ నగర్‌ లడ్డూ. లడ్డూ వేలం పాటలో గత ఏడాది నగరంలో రెండో స్థానంలో నిలిచిన ఫిలింనగర్‌లోని వినాయక్‌నగర్‌ బస్తీ గణపతి లడ్డూ ఈ ఏడాది ప్రథమ స్థానంలో నిలిచింది. వినాయక్‌నగర్‌ బస్తీలోని గణపతి లడ్డూను రూ.17.75 లక్షలకు బీజేపీ నేత పల్లపు గోవర్ధన్‌ కైవసం చేసుకున్నారు. ఈ వినాయక్‌నగర్‌ గణపతి లడ్డూ గత ఏడాది రూ. 15.1 లక్షల ధర పలికింది. ఇవాళ ఉదయం బాలాపూర్ కూడలిలో జరిగిన వేలం పాటలో రూ. 17 లక్షల 60 వేలకు కొలను రాంరెడ్డి.. బాలాపూర్ గణేషుడి లడ్డూను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా లింగాల కొలను రాంరెడ్డికి పలువురు అభినందనలు తెలిపారు. తొలిసారి బాలాపూర్ గణేషుడి లడ్డూను దక్కించుకోవడం సంతోషంగా ఉందన్నారు కొలను రాంరెడ్డి. గతేడాది ఈ లడ్డూ రూ. 16.60 లక్షలకు శ్రీనివాస్ గుప్తా అనే వ్యక్తి దక్కించుకున్నాడు. ఈ ఏడాది బాలాపూర్ లడ్డూ వేలం పాటలో మొత్తం 19 మంది పాల్గొన్నారు…