బాలిక ను మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసిన సంఘటన పర్వతగిరి మండలం లోని పెద్ద తండాలో చోటు చేసుకుంది. ఎస్సై కరుణాకర్ తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 13న మండల కేంద్రంలో పాఠశాలలో చదువుతున్న ఓ బాలిక సొమ్మసిల్లి కిందపడిపోవడంతో గుర్తించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ సూచనల మేరకు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సలహా మేరకు హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రి సమీపంలోనే చేరుకునే సమయంలో విద్యార్థిని మృతి చెందింది. పిడ్స్ కారణంగా మృతి చెందినట్లు భావించిన విద్యార్థిని తల్లిదండ్రులు దహన సంస్కారాలు చేశారు. అనంతరం బాలిక సొంత చెల్లి ఇంటి ఎదుట ఉండే భూక్య గణేష్ అనే వ్యక్తి అక్క ని ప్రేమించి మోసం చేశారని, ఇబ్బందులకు గురి చేసే వాడని వారిద్దరి మధ్య గొడవ జరిగిందని తల్లిదండ్రులకు తెలిపింది.

దీంతో కంగుతిన్న తల్లిదండ్రులు తన కూతురును ప్రేమించి మోసం చేసి ఆమె మరణానికి కారణమైన వ్యక్తి శిక్షించాలని బాలిక తండ్రి సికిందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.