విద్యార్థులు తప్పుదోవ పట్టకుండా చూడాల్సిన ఆమే తప్పు దారి పట్టింది, తానే కాదు, విద్యార్థులనూ చెడు దారి పట్టించింది. Us అరిజోనా స్టేట్ లాస్ బ్రిసాస్ అకాడమీలో టీచర్‌గా పని చేస్తోంది ఓ మహిళ(28). స్కూల్‌లో ఆమె ఓ పదమూడేళ్ల మైనర్ విద్యార్థితో శారీరక సంబంధం పెట్టుకుంది. మొదట్లో అతడ్ని లైంగికంగా వేధించి లొంగదీసుకున్న ఆమె, ఆ తర్వాత అతడితో శృంగార కార్యకలాపాల్లో మునిగిపోయింది. ఎంతలా అంటే క్లాస్‌రూమ్, కారులో, ఆమె ఇంట్లో! ఇలా దాదాపు 10 సార్లు అతడితో సెక్స్ చేసింది. అంతేకాదు, అతడికి అసహజ శృంగారానికి సంబంధించిన మెటీరియల్ అందజేసి, వాటిని ప్రయత్నిద్దామని సూచించింది. అయితే, బాలుడి ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లిదండ్రులు అతడి ఫోన్‌లో మానిటరింగ్ యాప్ ఇన్‌స్టాల్ చేశారు.
ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎటు వెళ్తు్న్నాడు? తదితర విషయాలు తెలుసుకునే ప్రయత్నంలో వారికి ఊహించని షాక్ తగిలింది.

Advertisement

టీచర్ తమ అబ్బాయిని ప్రలోభపెట్టి, అతడితో సెక్స్ చేస్తోందన్న విషయాన్ని తెలుసుకున్నారు. వెంటనే ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఆమెను అరెస్టు చేశారు. తమ కుమారుడి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటోందని ఆరోపించారు. దీనిపై వాదోపవాదనలు సాగగా, నిందితురాలికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కాగా, నిందితురాలికి ఇప్పటికే పెళ్లి అయ్యింది. భర్త కూడా ఆమెతో పాటే ఉన్నాడు. క్షణికావేశంలో ఓ బాలుడితో శారీరక సంబంధం పెట్టుకున్న ఆమె ఇప్పుడు తన యవ్వన జీవితాన్నంతా జైలులోనే గడపనుండటం కొస మెరుపు.