తాజాగా ‘అవెంజర్స్‌’లో నిక్‌ ఫ్యూరీ పాత్ర పోషించిన న‌టుడు శామ్యూల్ ఎల్‌. జాక్సన్‌ యూట్యూబ్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. తన తర్వాతి చిత్రం ‘అవెంజర్స్‌: కెప్టెన్ మార్వెల్‌’ ప్రచారంలో భాగంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఇండియాకు వెళ్తారా అని ప్రశ్నించగా. ‘నాకు పని కల్పిస్తే వెళ్తా’ అని జాక్సన్ తెలిపాడు. అనంతరం బాలీవుడ్‌లో పనిచేస్తారా అని అడగగా.. ”బాహుబలి 3′ చిత్రం కోసం పనిచేయాలని ఉంది’ అని టక్కున సమాధానం చెప్పాడు. దీంతో మరోసారి ‘బాహుబలి’ సినిమా వార్తల్లో నిలిచింది. అన్నా బోడెన్, ర్యాన్ ఫ్లెక్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ”అవెంజర్స్‌: కెప్టెన్‌ మార్వెల్‌’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్‌ అందుకుంది.