ఇప్పడు ట్రెండ్ కదా అని కొందరు బయోపిక్ లు తీసి బ్లాక్ బస్టర్లు సాధించాలని అనుకుంటారు . మరికొందరు బూతు సినిమాలు తీసి సాములు చేసుకుందామని ఆశపడతారు . కానీ ఎలాంటి సినిమాకైనా కావాల్సింది సరైన కంటెంట్ కంటెంట్ ఉ న్నపుడు బయోపిక్ చూస్తారు . . బూతు సినిమా అయినా చూస్తారు . కానీ కంటెంట్ లేకుండా ఇష్టం వచ్చిన దాంతో నింపేసి చూడమంటే ఎవరూ చూడరు . ఈ జెనరేషన్ ఆడియన్స్ చాలా తెలివైనవారు . నాసిరకం సరుకు ఎక్కడున్నా వెంటనే పసిగట్టేస్తారు . తాజాగా 4 లెటర్స్ ” అనే బూతు కంటెంట్ సినిమా రిలీజ్ అయింది . ఆ సినిమాకు ప్రేక్షకులే కరువయ్యారు . బికినీలున్నాయి, భామలు రెచ్చిపోయి గ్లామర్ షో చేశారు, బూతు డైలాగులు కూడా ఫుల్ గా ఉన్నాయి. వీటికి తోడుగా నిర్మాతలు సినిమాకు ప్రచారం కూడా జోరుగా చేశారు . కానీ సినిమా బాగాలేదని మొదటి షో నుండే టాక్ రావడంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం థియేటర్లకు వెళ్లేందుకు ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించడం లేదు . దీంతో మొదటి రోజు నుండే ఈ సినిమా చేతులెత్తేసింది . ఇలా నాలుగు బికినీ సీన్లు.. పది బూతు డైలాగులతో సినిమా తీసి సామ్ము చేసుకుందామని కక్కుర్తి పడే ఫిలిం మేకర్స్ లో ఈ సినిమా ఫలితంతో అయినా కాస్త మార్పు వస్తుందేమో వేచి చూడాలి . 4 లెటర్స్ ‘ రిజల్ట్ మాత్రమే ఇప్పటికి వచ్చింది . ఇంకా లైన్లో రెండు మూడు బూతు సినిమాలు ఉన్నాయి . మరి వాటి పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూడాలి .