పెళ్లి తర్వాత ఏ హీరోయిన్ అయినా రోమాన్స్ సీన్లలో నటించడానికి అంతగా ఇష్టపడరు. కానీ, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, తన అందాల ఆరబోతలో పెళ్లైనా ఏమాత్రం తగ్గడం లేదు. హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రకారు హృదయాల్లో హీట్ పుట్టిస్తోంది.

ఇక, ‘క్వాంటికో’ సిరీస్‌తో పాటు ‘బేవాచ్‌’లో అందాల ఆరబోతతో పిచ్చెక్కించిన ప్రియాంక ఇప్పుడు ‘ది స్కై ఈజ్ పింక్’ సినిమాలో మరోసారి హాట్ సీన్స్ చేస్తూ మతులు పోగొడుతోంది. ఈ సినిమాలో ఫర్హాన్ అక్తర్‌తో ప్రియాంక చేసిన బెడ్రూమ్ సీన్ మామూలుగా లేదు. ప్రియాంక చోప్రా పెళ్లైనా కూడా ఈ స్థాయిలో రెచ్చిపోతుందని ఎవరూ ఊహించి ఉండరేమో?, ఈ సినిమాలో ఇలాంటి సన్నివేశాలు ఇంకా చాలానే ఉన్నాయట.

హాలీవుడ్‌లోనూ సినిమా విడుదల కానుండటంతో ప్రియాంక ఈ రేంజ్‌లో సెగలు పుట్టిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విడుదలైన ఫర్హాన్, ప్రియాంక బెడ్రూమ్ రోమాన్స్ వీడియో సినిమాపై మరింత ఆసక్తి పెంచేసింది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.