బైకుపై వెళ్తున్న యువకుడు కరెంట్ షాక్ కొట్టి మృతి చెందాడు. ఈ విషాద ఘటన వేములపల్లి మండలపరిదిలోని రావులపెంట గ్రామ శివారులో జరిగింది. సాగర్ ఎడమ కాల్వ దగ్గర 11 కెవి విద్యుత్ తీగ కిందికి వాలి ఉంది. తాళ్ళకంపడు గ్రామానికి చెందిన నిమ్మగోటి సాయి అనే యువకుడు బైక్ పై వెళ్తుండగా, ప్రమాదవశాత్తు ఆ విద్యుత్ తీగ తగలడంతో షాక్ కు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సాయి మృతితో తాళ్లకంపడు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలను అధికారులు ఇప్పటికైనా తొలగించాలని ప్రజలు కోరుతున్నారు…