లవర్స్ మాత్రమే కాదు, పెళ్ళైన వారు కూడా హద్దులు మీరు ప్రవర్తిస్తున్నారు. తప్పు, ఒప్పు తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ దంపతులు బైక్ మీద వెళ్తూ ఓ పని చేశారు. అది కూడా బైక్ మీద తమ పిల్లాడు ఉండగా చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పిల్లాడు ఉండగా ఇవేం పాడు పనులు అంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు. వివరాలు: భర్తకు దగ్గరుండి మద్యం పోసి, సిగరెట్ తాగించే భార్యలు ఉంటారా.? అంటే ఈ వీడియో చూస్తే అవుననే అనిపిస్తుంది. ఓ ఇల్లాలు బైక్ మీద వెళ్తుండగా తన భర్తకు సిగరెట్ తాగడంలో సహాయం చేస్తుంది. ‘మీరెందుకండి శ్రమ పడతారు. నేనున్నా కదా’ అని సిగరెట్ నోటిలో పెట్టి భర్తకు పని తగ్గిస్తుంది. అబ్బా ఎంత మంచి భార్య అని గుప్పు గుప్పు మంటూ పొగ తాగి బయటకు వదులుతున్నాడు.

Advertisement

అయితే బైక్ మీద వారితో పాటు వారి బిడ్డ కూడా ఉన్నాడు. ఈ వీడియోని ఒక నెటిజన్ షేర్ చేస్తూ ఇలాంటి భార్య కావాలి అంటూ క్యాప్షన్ పెట్టాడు. దీనిపై నెటిజన్స్ మండిపడుతున్నారు భార్య అంటే ఎలా ఉండాలి. భర్త మద్యం తాగితే తిట్టాలి, సిగరెట్ తాగితే పాడైపోతాయని కొట్టాలి. అంతేగాని దగ్గరుండి లివరు, లంగ్సు చెడగొడతారా? ఇదెక్కడి చోద్యం అని కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది పిల్లాడి ముందు సిగరెట్ తాగడం ఏంటి? దాన్ని భార్య సమర్ధించడం ఏమిటి అని తిట్టిపోస్తున్నారు. అంతే కాదు తలకు హెల్మెట్ లేకుండా ఎలా బైక్ నడుపుతారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హెల్మెట్ లేకుండా బైక్ నడపడమే నేరం అనుకుంటే బహిరంగ ప్రదేశంలో సిగరెట్ తాగడం ఇంకా పెద్ద నేరమని వీరిపై వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.