కాంగ్రెస్ పార్టీ ములుగు ఎమ్మెల్యే సీతక్క వాహనం ఓ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో మూడేళ్ల చిన్నారి శ్రవంతి మృతి చెందింది. దంపతులు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ములుగు జిల్లా ఏటూరు నాగారం శివారులోని జీడివాగు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా.. గాయపడిన దంపతులను ఏటూరు నాగారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు ముందు భాగం ధ్వంసమైంది.